‘‘అమూల్య మణిమయసంపన్నమగు ఖనిగా మానవుని పరిగణింపుడు. కేవలము విద్య మాత్రమే, అది తన యైశ్వర్యములనువెల్లడించి, తన్మూలమున మానవాళి లబ్ధినొందునటుల, చేయగలదు.’’

బహాఉల్లా

మనిషి ఔన్నత్యంపట్ల పూర్ణవిశ్వాసంతో, వ్యక్తిలోని సహజ ప్రతిభాపాటవాలను సక్రమరీతిలో, నిరవధికంగా పెంపొందిస్తూ ఉండడం సామాజిక శ్రేయస్సుకు అత్యవసరమని బహాయిలు విశ్వసిస్తారు. సమాజోద్ధరణకై ప్రతి ఒక్కరి విస్తృతసామర్ధ్యాలనూ సమాయత్తపరిచే ప్రక్రియ - విద్య. నిజమైన సౌభాగ్యానికి దోహదం చేసేందుకు గాను, మనిషి జీవితంలోని ఆధ్యాత్మిక, భౌతికకోణాలను రెండింటినీ అది స్పృశించాలి.

వైయక్తిక విశ్వాసి ఆధ్యాత్మిక, మేధోసామర్ధ్యాలను ప్రజాక్షేమానికి, జీవితకాలంపాటు సేవలను అందించడం లక్ష్యంగాగల విద్యా/శిక్షణా కార్యక్రమాలలో బహాయిలు నిమగ్నులై ఉండడం – సమాజనిర్మాణ కార్యకలాపాలలో కీలకాంశం.

బాలలు
వ్యక్తిని ఆధ్యాత్మికంగా చైతన్యపరిచే ఆధ్యాత్మిక లక్షణాలను, నమ్మకాలను, అలవాట్లను, ప్రవర్తనారీతులను అభివృద్ధిచేయడం లక్ష్యంగా బాలల ఆధ్యాత్మికవిద్యా తరగతులు పలు సందర్భాలలో, నేపధ్యాలలో జరుగుతూ ఉంటాయి.

కిశోరప్రాయులు
నిర్ణయాలను తీసుకోవడంలోనూ, ఆధ్యాత్మికదృక్కోణాన్ని, నైతికస్థితిని పెంపొందించుకోవడంలోనూ తమకు సహకరించే ఒక ముఖ్యకార్యక్రమంలో దేశవ్యాప్తంగా కిశోరప్రాయులు బృందాలుబృందాలుగా పాల్గొంటున్నారు. వారు తమ అభివ్యక్తీకరణశక్తిని పెంపొందించుకుని, తమ అపారశక్తి సామర్ధ్యాలను తమ సమాజాల సేవలకు వినియోగిస్తుంటారు.

యువజనులూ- వయోజనులూ
గ్రామీణ, నగర/పట్టణ ప్రాంతాల యువజనులూ, వయోజనులూ వికేంద్రీకృత శిక్షణాప్రక్రియద్వారా తమ సమాజాలకు సేవలను అందించేందుకుగాను మేధో, నైతిక, ఆధ్యాత్మిక, క్రియాశీలక సామర్ధ్యాలను పెంపొందించు కుంటున్నారు.