బహాయిదివ్యధర్మం యొక్క అంతర్జాతీయ పరిపాలనా వ్యవస్థ – విశ్వన్యాయమందిరము. బహాఉల్లా తన శాసనగ్రంథమైన కితాబ్-ఎ-అఖ్దస్ లో, ఈ వ్యవస్థ యొక్క ఏర్పాటును నిర్దేశించాడు.
అన్ని జాతీయ ఆధ్యాత్మిక సభల సభ్యులచేతా ఐదేళ్లకొక పర్యాయం ఎన్నుకోబడే తొమ్మిదిమంది సభ్యుల వ్యవస్థ – విశ్వన్యాయ మందిరము. మానవజాతి సంక్షేమంమీద సానుకూల ప్రభావాన్ని చూపేందుకూ, విద్యనూ, శాంతినీ, ప్రపంచాభ్యుదయాన్నీ ప్రోత్సహించేందుకూ, మనిషి గౌరవాన్ని, మతంస్థాయినీ పరిరక్షించేందుకూగాను విశ్వన్యాయమందిరానికి దైవదత్తమైన అధికారాన్ని ప్రసాదించాడు బహాఉల్లా. నిత్యం పరివర్తితమయ్యే సమాజావసరాలకు బహాయి బోధనలను అనువర్తించే బాధ్యతను అప్పగించడం ద్వారా, దివ్యధర్మంయొక్క పవిత్రలేఖనాలలో స్పష్టంగా ప్రస్తావించబడని అంశాలపై శాసనాలను చేసే అధికారం ఆ వ్యవస్థకు సంక్రమింప చేయడం జరిగింది.
1963లో తొలిసారిగా ఎన్నికైనప్పటినుండీ, విశ్వన్యాయ మందిరం – అభ్యుదయ ప్రపూరిత విశ్వనాగరికతను నెలకొల్పగల సామర్ధ్యాన్ని పెంపొందించుకునే విషయంలో బహాయి ప్రపంచ సమాజానికి పథనిర్దేశం చేస్తూవచ్చింది. ప్రపంచశాంతి విషయంలో బహాఉల్లా దార్శనికతకు వాస్తవరూపాన్నివ్వడ మెలాగో నేర్చుకుంటూ ఉండే క్రమంలో, బహాయి సమాజానికి – విశ్వన్యాయమందిర మార్గదర్శకత్వం – భావైక్యతా, కార్యైక్యతా సమకూడేలా చేస్తుంది.
Exploring this topic:
- A Unique Institution
- Development of the Bahá’í Community Since 1963
- The Seat of the Universal House of Justice
- Quotations
- Articles and Resources